ఉరవకొండ: ఉరవకొండలో సైకో వీరంగం బీతిల్లుతున్న జనం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో సైకో వీరంగంతో జనం బీతిల్లిపోతున్నారు. రాత్రిళ్ళు ఇందిరానగర్, శివరామిరెడ్డి కాలనీ, హమాలి కాలనీల్లో ఇళ్ల గేట్లు కొడుతూ బయటకు వచ్చిన వారిపై దాడులు చేసిన సైకో పలు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులపై సైతం దాడులు చేసిన గతనాలకు సంబంధించిన సీసీ కెమెరాలను మంగళవారం పట్టణ పోలీసులు పరిశీలించారు. పట్టణంలో దాడులకు పాల్పడుతున్న సైకో పట్ల పోలీసులు కట్టిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు పోలీసులను కోరుతున్నారు.