ఉరవకొండ: గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా డ్రై డే కార్యక్రమాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్ మండలంలో పలు గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా డ్రైడే కార్యక్రమాలను శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహించడం జరిగిందని మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డొనేకల్ పాల్తూరు, వేల్పుమడుగు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి డ్రై డే పాటించాలని అవగాహన కల్పించారు. డ్రైడే పాటించడం మూలంగా దోమల ఉధృతిని నివారించడం జరుగుతుందన్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.