రాప్తాడు: సిండికేట్ నగర్ లో రాధా హత్య చేసిన నిందితుడు ఆదినారాయణ అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ స్టేషన్ ఇంచార్జ్ సిఐ వెంకటేశ్వర్లు
అనంతపురం జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు సీఐ అనంతపురం రూరల్ స్టేషన్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిండికేట్ నగర్ లో 17 4 2026న రాధా అనే 53 సంవత్సరాల మహిళా హత్య కేసులో ఆదినారాయణ అనే నిందితుని నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగిందని నిందితుడు సిండికేట్ నగర్ లో రాధ అనే 53 సంవత్సరాల మహిళను హత్య చేసినట్లు గతంలో కూడా ఆమె భర్త చంద్రనాయుడు ను కూడా హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సిఐ వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలను వెల్లడించారు.