యర్రగొండపాలెం: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనం
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలనందు దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ముగింపు రోజు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు వివిధ రూపాలతో భక్తులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.