ఉరవకొండ: బెలుగుప్పలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుక
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకొని టిడిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు కేకును కత్తిరించి సంబరాలు చేసుకున్నారు. దళితగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నవ్యాంధ్ర రూపకర్త, అమరావతి సృష్టికర్త, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేర్పరి, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే ధీరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అని పేర్కొంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.