సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలోని సీయోను ప్రార్థన మందిరంలో ఘనంగా ఈస్టర్ వేడుకలను జరుపుకున్న క్రైస్తవులు
చీమకుర్తి పట్టణంలోని సీయోను ప్రార్ధనా మందిరంలో ఆదివారం ఈస్టర్ పండుగను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీయోను చర్చి పాస్టర్లు ముత్తయ్య మరియు పవన్ కుమార్ మాట్లాడుతూ.... ఈస్టర్ పండుగ విశిష్టతను వివరించారు. గుడ్ ఫ్రైడే మూడో రోజున ఈస్టర్ వేడుకను క్రైస్తవులు జరుపుకుంటారన్నారు. క్రీస్తు పునరుద్దానం యొక్క విశిష్టతను ఈస్టర్ పండుగ తెలియజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని వినిపించారు.