సంతనూతలపాడు: ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలనుండి అర్జీలను స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు అర్జీలను సమర్పించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి 30 అర్జీలు వచ్చాయని, అందులో నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాల కొరకు ప్రజలు అర్జీలు సమర్పించాలని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి, త్వరగా పరిష్కరించాలని ఆదేశిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు.