రాప్తాడు: పండమేరు వంక వద్ద నాలుగు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయి నగర్ పండమేరు వంక వద్ద మంగళవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ చిన్మయ నగర్ అనంతపురం కలుపుతూ పండమేరు వంక వద్ద నాలుగు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించి త్వరలోనే ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.