ఉరవకొండ: నక్కలపల్లి గ్రామ పంచాయతీ లో తాగునీటి సమస్య తీర్చుటకు అదనపు బోరు ఏర్పాటు చేస్తాం : ఎంపీడీవో లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామ పంచాయతీ లో తాగునీటి సమస్య తీర్చుటకు ప్రత్యేక అధికారి శ్రీ టి లక్షి నారాయణ గారి ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగా బోర్ వేయుటకు జియాలాజిస్ట్ ద్వారా బోర్ పాయింట్ చూపించడం జరిగింది. గ్రామ ప్రజలకు కొత్త బోర్ వేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించడం జరుగుతుంది అని ఎంపీడీఓ గారు తెలపడమైనది ఇందులో డిప్యూటీ ఎంపీడీవో హనుమంత రెడ్డి, పంచాయతీ సెక్రటరీ మంజునాథ్, నాయకులు వెంకట్రామిరెడ్డి పాల్గొనడం జరిగింది