ఉరవకొండ: ఎర్రగుడిలో ముగిసిన చిన్న మొహరం వేడుకలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో శుక్రవారం చిన్న మొహరం వేడుకలు జలధి కార్యక్రమాలతో ముగిసాయి. ముగింపు వేడుకల్లో భాగంగా అగ్నిగుండం వద్ద పీర్ల స్వాములకు ముజావర్లు చక్కెర చదివింపులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండ ప్రవేశం చేసిన తదుపరి అగ్నిగుండాన్ని ప్రార్ధనల మధ్య పూడ్చి వేశారు. తదనంతరం పీర్ల స్వాములు భక్తజనంతో కలసి జలధికి తరలి వెళ్లడంతో చిన్న మొహరం వేడుకలు ముగిశాయి. మొహరం వేడుకల్లో భాగంగా శాంతిభద్రతులను బెలుగుప్ప ఎస్సై శివ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.