కొండపి: విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత లెక్చరర్ల పైనే ఉంటుంది: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఫిబ్రవరిలో జరగబోయే పరీక్షలకు ప్రత్యేక క్లాసులు తీసుకొని సన్నద్ధం చేయాలని మంత్రి స్వామి లెక్చరర్లను కోరారు. శనివారం కొండపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత లెక్చరర్ల దేనన్నారు. వచ్చే నెలలో జరిగే పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత శాతం ఉండాలని కోరారు.