కొండపి: మాది లాక్కున్న పార్టీ కాదు, వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అసలే కాదు: ఒంగోలు వైసిపి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీ కాదు, వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అసలే కాదని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒంగోలులో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందని వారిని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తుందన్నారు. ఇటువంటి వాటికి వైసిపి నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.