కొండపి: సింగరాయకొండ లోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని మాజీ మంత్రి సురేష్ పూజలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లోని పాత సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి ప్రస్తుత కొండపి వైసిపి ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని వైసీపీ నాయకులపై కూటమి నాయకులు దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలన్నారు.