కొండపి: సింగరాయకొండ మండలంలోని కందుకూరు ఫ్లైఓవర్ వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కందుకూరు ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ద్విచక్ర వాహన దారుడిని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి కొత్తపట్నం మండలానికి చెందిన వెంకటేష్ గా పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.