సంతనూతలపాడు: గాలి,వాన బీభత్సానికి సంతనూతలపాడు ఆర్ అండ్ బి రహదారిపై ఊరికి పడ్డ చెట్లు, చెట్లను తొలగింపజేసిన ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చెట్లు రహదారిపై విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం తెలుసుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు సిబ్బందితో కలిసి జెసిబి యంత్రాలతో రహదారిపై విరిగిపడ్డ చెట్లను తొలగింప చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.