సంతనూతలపాడు: చీమకుర్తి మండలం బోదవాడలో గంజాయి విక్రయాలపై పోలీసుల దాడులు, 800 గ్రాముల గంజాయి స్వాధీనం, ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్
చీమకుర్తి మండలం బోధవాడలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్క సమాచారంతో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.