ఉరవకొండ: గ్రామాల్లో మలేరియా మాసోత్సవ ర్యాలీలు
అనంతపురం జిల్లాఉరవకొండ వజ్రకరూరు విడపనకల్లు మండలాల్లోని పలు ప్రాంతాలలో మలేరియా మాసోత్సవ ర్యాలీలు ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంకాలం వరకు ఘనంగా జరిగాయి పాల్తూరు వజ్రకరూరు పి కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ శివ శంకర్ నాయక్ డాక్టర్ తేజేశ్వరి డాక్టర్ జై కుమార్ నాయక్ ల ఆధ్వర్యంలో గ్రామాలలో మలేరియా మాసోత్సవ ర్యాలీలను ఘనంగా నిర్వహించారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రజలు దోమల బారి నుండి తగు జాగ్రత్తలు తీసుకొని దోమతెరలు వాడి అప్రమత్తంగాఉండాలన్నారు.