సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో వ్యక్తి దారుణ హత్య
చీమకుర్తి: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చీమకుర్తి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి పట్టణంలోని రామనగర్ 4 వ లైన్ లో రామయోగి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే రామయోగిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో మృతుడు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన రామయోగి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. హతకు గల కారణాలు తెలియవలసి ఉంది