కనిగిరి: పామూరు లో స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు
పామూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు బుధవారం ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగస్వాములై, మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.