కనిగిరి: పామూరు మండలం అయ్యవారిపల్లి లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఉపాధ్యాయురాలు
పామూరు: ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పామూరు మండలం అయ్యవారిపల్లి లో శనివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యవారిపల్లి గ్రామంలో మాధవి అనే 24 సంవత్సరాల మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో... సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవలసి ఉంది.