ఉరవకొండ: వజ్రకరూర్ లో బీసీ గళం పోస్టర్ల ఆవిష్కరణ
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర పీఏసీ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణయ్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో "బీసీ గళం" పార్టీ బిసి సెల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు డిష్. సురేష్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గోవిందు ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ నాయకులు బీసీ సంఘం సభ్యులతో కలిసి బీసీ కలం పోస్టర్లను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26న అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ఉదయం 10 గంటలకు జరిగే బీసీ గళం సభను విజయవంతం చేయాలన్నారు.