రాప్తాడు: రాచానాపల్లిలో గోపికృష్ణ గురుకుల పాఠశాలలో వ్యక్తిగత వికాసం సమాజ వికాసం కార్యక్రమంలో ఐఏఎస్ ఫౌండేషన్ సీఈవో రాఘవేంద్రరావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో రాచానాపల్లిలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయం గోపికృష్ణ గురుకుల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యక్తిగత వికాసం సమాజ వికాసం కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఐఏఎస్ ఫౌండేషన్ సీఈవో రాఘవేంద్రరావు ముఖ్యఅతిథిగా.ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించే వారికి సామాజిక విలువలు తెలియకుండా పోతున్నాయని విద్యార్థి స్థాయి నుంచి విద్యార్థినిలకు వ్యక్తిగత వికాసం సమాజ వికాసం గురించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అప్పుడే సమాజం కూడా బాగా ఉంటుందని వ్యక్తిగతంగా వారు కూడా అభివృద్ధి చెందుతారని ఐఏఎస్ ఫౌండేషన్ సీఈవో రాఘవేంద్రరావు తెలిపారు.