రామచంద్రపురం: రామచంద్రపురంలో భారీ వర్షాలు: సాగుపై ఆశలు చిగురించిన రైతులు
అల్పపీడనం ప్రభావంతో రామచంద్రపురం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానలు ఉపశమనాన్ని ఇచ్చాయి. నీటి ఎద్దడి ఉన్న పొలాలకు ఇవి మేలు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.