కంది: సంగారెడ్డి: వ్యవసాయ విద్యార్థుల పంట సాగు.. తొలి కోతలోనే రూ.2,400 ఆదాయం
సంగారెడ్డి జిల్లా కంది వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు సాగు చేసిన బంతి పూల పంటలో మొదటి కోత చేపట్టారు. 20 కిలోల పువ్వులను ఐఐటీ హైదరాబాద్లో విక్రయించి రూ.2,400 ఆదాయం పొందారు. ఈ అనుభవం ద్వారా విద్యార్థులు మార్కెటింగ్ మెళకువలను నేర్చుకున్నారు.