సంతనూతలపాడు: చీమకుర్తిలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, కారణాలు ఇవే!
చీమకుర్తి నెహ్రు నగర్ లో నూకల రాము అనే యువకుడు సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రాము ఆత్మహత్యకు సంబంధించిన కారణాలను మంగళవారం మృతుడి తల్లి నాగేశ్వరమ్మ పోలీసులకు వెల్లడించారు. మూడు సంవత్సరాల క్రితం మృతుడు రాము అనూష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా మనస్పర్ధలతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. అప్పటినుండి మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది రాము ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి పోలీసుల విచారణలో వెల్లడించారు.