కనిగిరి: వెలిగండ్లలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల కు భారీగా తరలివచ్చిన భక్తులు, అమ్మవారి దర్శనానికి సరైన ఏర్పాట్లు లేక ఇక్కట్లు
వెలిగండ్లలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు శుక్రవారం భారీగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు అమ్మవారి దర్శనానికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సరేనా ఏర్పాట్లు చేయకపోవడంతో అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతూ ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత ఏడాది కూడా ఇలానే ఇబ్బందులు పడ్డ భక్తులు, ఈ ఏడాదైనా సరైన ఏర్పాట్లు చేస్తారనుకుంటే ఆ విధంగా జరగకపోవడంతో ఇక్కట్లు పడవలసిన పరిస్థితి ఏర్పడింది.