ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు అభిషేకాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీమంజునాథ స్వామి దేవాలయంలో మాస శివరాత్రి పూజలను 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆరుద్ర నక్షత్రం లో విశిష్ట పూజలు పంచామృత అభిషేకాలను సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఆలయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సామూహిక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదాన, మరియు భజన కార్యక్రమాలను శ్రీ మంజునాథ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.