కనిగిరి: పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులు
కనిగిరి పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఒకటో వార్డులో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ... పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ... కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మరియు సుందరీ కరణ చేసేందుకు ఆపరేషన్ క్లీన్ స్లీప్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో జెసిబి యంత్రాలతో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.