సంతనూతలపాడు: ఉప్పుగుండూరు లో రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు, ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలింపు
నాగులుప్పలపాడు: రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గురువారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేగంగా వెళుతున్న రైలు నుండి ఓ వ్యక్తి ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో రైల్వే సిబ్బంది ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.