ఉరవకొండ: హనిమరెడ్డి పల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హనిమి రెడ్డిపల్లి, కాలువపల్లి గ్రామాల మధ్య ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందికి పడిపోవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపినవివరాలు మేరకు బొమ్మగానిపల్లి తండాకు చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో అనంతపురం వెలుతూ హనిమి రెడ్డిపల్లి దాటిన తర్వాత అదుపుతప్పి కిందికి పడి పోవడంతో తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించడం తో అనంతపురం ప్రభుత్వం వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.