రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో మార్చ్ ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో డైరెక్టర్ ఆఫ్ వాల్యూయేషన్ నాగ ప్రసాద్ నాయుడు మార్చ్ ఏప్రిల్ నెలలు నిర్వహించిన బీఫార్మసీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి ఏప్రిల్ నెలలో బీఫార్మసీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసామని నాగప్రసాద నాయుడు పేర్కొన్నారు.