దర్శి: ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు -తాళ్లూరు రహదారిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు తాళ్లూరు రహదారిలో గల శ్రీరామ్ మిల్క్ డైరీ వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహం సైడ్ కాలవలో స్థానికులు గుర్తించారు. ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు యొక్క వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.