దర్శి: దర్శి పట్టణంలో మానవత్వం చాటుకున్న దర్శి ఎస్ఐ రాంబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్
దర్శిలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగి మంగళవారం రాత్రి గడియార స్తంభం సెంటర్కు సమీపంలో రోడ్డుపై పడిపోయాడు. గమనించిన ఏఎస్ఐ ఆరికాటి రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్ మానవతా దృక్పథంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్లి రోడ్డు దాటించి మానవత్వం చాటుకున్నారు. స్థానికులు పోలీసులు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారు.