ఉరవకొండ: బెలుగుప్పలో మొహరం వేడుకల్లో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించిన వన్నూరు స్వామి భక్త బృందం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వన్నూరు స్వామి కట్ట వద్ద మొహరం వేడుకలు సందర్భంగా ఐదో రోజు అన్నదాన కార్యక్రమాన్ని వన్నూరు స్వామి భక్త బృందం కలసి సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. భక్త బృందం సభ్యులు పూజారి నరేష్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గత మూడు సంవత్సరాలుగా మొహరం వేడుకల్లో 5వ రోజు శ్రీ వన్నూరు స్వామి పెట్టె ఊరేగింపు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భక్తు బృందం సభ్యులు పేర్కొన్నారు.