రాప్తాడు: కనగానపల్లి మండల కేంద్రంలో రెడ్డివారి కుంట చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రెడ్డివారికుంట చెరువు మరమత్తు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనుగానపల్లి మండలంలో 2024 లో భారీ వర్షాల కారణంగా రెడ్డివారి కుంట చెరువు తెగిపోవడం జరిగిందని ఈ సందర్భంలోనే గత నెల 17న 86 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగిందని వర్షాకాలం లోపల ఈ చెరువు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.