సంతనూతలపాడు: చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ దాసరి ప్రసాద్
చీమకుర్తి పట్టణ పోలీస్ స్టేషన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో కలిసి సిఐ దాసరి ప్రసాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సిఐ ప్రసాద్ కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐ పిలుపునిచ్చారు.