కనిగిరి: పట్టణంలోని పెద్ద చెరువు, నాగుల చెరువులను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోమయ్య
కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో సీపీఎం పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్య దర్శి డి.సోమయ్య మాట్లాడుతూ.. కనిగిరి పెద్ద చెరువు, నాగుల చెరువులను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చి, ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత జలాలను అందించాలని కోరారు. భూ కబ్జాదారులపై అధికారులుచర్యలు తీసుకోవాలన్నారు. కృత్రిమ ఇంధన కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.