కనిగిరి: కనిగిరి మాజీ ఎమ్మెల్యే తిరుపతి నాయుడు సతీమణి లక్ష్మమ్మ ఆకస్మిక మృతి, నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు
కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతి నాయుడు సతీమణి, పామూరు మాజీ ఎంపీపీ ఇరిగినేని లక్ష్మమ్మ ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పామూరు మండలంలోని మోపాడులో లక్ష్మమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, లక్ష్మమ్మ చేసిన సేవలను కొనియాడారు.