ఏలూరు అర్బన్: ఏలూరులో బాలిక గర్భవతి కేసు: నిందితుడు అరెస్ట్
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు పాల గూడానికి చెందిన రేవలగడ్డ భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసినట్లు ఆరోపణలు రావడంతో, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని ఆశ్రం ఆసుపత్రి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.