యాడికి మండలం చిక్కేపల్లి గ్రామ సమీపంలో హనుమంతు రెడ్డి అనే రైతుకు చెందిన కొర్ర గడ్డి వామి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కొర్ర గడ్డి వామి పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి హనుమంత రెడ్డికి సమాచారం ఇచ్చారు. హనుమంతు రెడ్డి స్థానికులతో కలిసి మండల ఆర్పడానికి శత విధాల ప్రయత్నించాడు. మంటలు అదుపులోకి రాలేదు.మంటల్లో వామి పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.