కనిగిరి: నాన్న... జాగ్రత్త అంటూ అరచేతిపై రాసుకుని , కూతురి ఆత్మహత్య, అయ్యవారిపల్లి లో వెలుగు చూసిన విషాదం
పామూరు మండలంలోని అయ్యవారిపల్లి లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మాధవి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం మాధవి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయేముందు మాధవి తన అరచేతిపై నాన్న... జాగ్రత్త అంటూ రాసుకుని ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో అందరిని కంఠతడి పెట్టిస్తుంది. కాగా నాగూర్ భాష అనే వ్యక్తి మాధవిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.