ఉరవకొండ: సమిష్టిగా పని చేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టిడిపి కుటుంబం మహానాడుతో నిరూపించింది
తెలుగుదేశం పార్టీ రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మహానాడు 2026 విజయవంతంగా పూర్తి అయిందని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో తగ్గుపర్తి మరియు విరుపాపల్లి గ్రామాల్లో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పార్టీ మండల నాయకులు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ఎంపికైన తర్వాత తొలి మహానాడు హైబ్రిడ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మండల కన్వీనర్ సునీల్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, నాయకులు కె.రాధాకృష్ణ, తిప్పయ్య పాల్గొన్నారు.