ఉరవకొండ: గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని పెద్ద కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను ఉరవకొండ డివిజన్ సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి బుధవారం తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం పీహెచ్సీ పీ కొట్టాలపల్లి పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానంగా దోమల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని దోమల కుట్టకుండా దోమతెరలు వాడాలని , పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇళ్ల వద్ద మురుగునీరు లేకుండా చూసుకోవాలని అవగాహన కల్పించారు.