సంతనూతలపాడు: భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యం: బి. నిడమానూరులో ఇరిగేషన్ శాఖ ఏఈ అనూష
నాగులుప్పలపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార- జల హారతి కార్యక్రమం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సాధించినట్లు ఇరిగేషన్ శాఖ ఏఈ అనూష తెలిపారు. నాగులుప్పలపాడు మండలం బి నిడమానూరులో శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చెరువులను ఆమె పరిశీలించారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చెరువులు నింపడం ఫీడర్ ఛానల్స్ మరియు వాగుల డీసిల్డింగ్ ద్వారా భూగర్భ జలాల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశం అన్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మనుషులకే కాకుండా జంతువులు, పక్షులకు ఇబ్బందులు తలెత్తమన్నారు