రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సబ్సిడీ వేరుశనగ విత్తనకాలను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు పంపిణీ చేయబోతున్న సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజర్ ను దృష్టిలో ఉంచుకొని రైతులకు వేరుశనగ విత్తనక్కాయలు సబ్సిడీతో రైతులకు అందించబోతున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లను వేరుశనగ విత్తన కాయలను పరిశీలించడం జరిగిందని రైతులంతా సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు కొనుక్కోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.