రాప్తాడు: కక్కలపల్లి ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించి అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగింపు నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 9:30 గంటల వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించి అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కక్కలపల్లి ఎస్సీ కాలనీలో అంబేద్కర్ జయంతి నిర్వహించి కేక్ ను కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం డాక్టర్ అంబేద్కర్ చేసిన మేలును ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి తెలిపారు.