సంతనూతలపాడు: మద్దిపాడు మండలం మల్లవరం కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైభవంగా గిరి ప్రదక్షిణ, పెద్ద సంఖ్యలో భక్తుల రాక
మద్దిపాడు మండలం మల్లవరం కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం వేద పండితులు మరియు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో స్వామివారి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మద్దిపాడు మండలం తో పాటు చుట్టుపక్కల మండలాల నుండి భక్తులు స్వామివారి గిరి ప్రదక్షణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.