ఉరవకొండ: కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు క్యాంపు కార్యాలయం నుంచి తాగునీటి పథకాలపై టెలి కాన్ఫరెన్స్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులతో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ బోర్డు, శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకంకు సంబంధించిన బిల్లులు, వర్కర్ల సమస్యలు, జీత భత్యాలు, ఆర్డబ్ల్యుఎస్ కింద సిపిడబ్ల్యు పథకాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో జిల్లాలో ఎలాంటి త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.