రాప్తాడు: చెర్లోపల్లిలో టిడిపి నేతల దాడిలో గాయపడిన సాకే మూర్తిని అనంతపురం ఆస్పత్రిలో పరామర్శించిన రాప్తాడు వైసీపీ నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కుమార్ ఆసుపత్రి నందు నిన్నటి రోజున చెర్లోపల్లి గ్రామంలో టిడిపి నేతల దాడిలో గాయపడిన సాకే మూర్తిని రాప్తాడు వైసిపి నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి రాజారామ్ రమేష్ తదితరులు మాట్లాడుతూ శనివారం రోజున చెర్లోపల్లిలో టిడిపి దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన సాకే మూర్తిని పరామర్శించి ఆర్థిక సహకారం అందించడం జరిగిందని సాకే మూర్తిపై దాడి చేసిన టిడిపి నేతలను కఠినంగా శిక్షించాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసిపి నల్లపురెడ్డి రాజారామ్ ఒంటిమిది రమేష్ తదితరులు డిమాండ్ చేశారు.