సంతనూతలపాడు: ఉప్పుగుండూరు లో 100 సంవత్సరాల చరిత్ర గల మర్రిచెట్టుకు నిప్పు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టుకు ఆదివారం నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మర్రి చెట్టుకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయా? కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.